Saturday 22 December 2012

Nayi Brhamin History

ఆంధ్రప్రదేశ్‌లోని కులాలలో మంగలి కులం ఒకటి. వీరిని నాయీ బ్రాహ్మణులు అని కూడా పిలుస్తారు. బి.సి.గ్రూప్ ఎ, సీరియల్ నెం. 16 వృత్తిరీత్యా క్షౌరం చేయడం వీరి పని. మంగలి కుల పురాణం ప్రకారం ధనవంత్రీ వైద్యం, కులవృత్తి క్షౌరం, భజంత్రీ మేళం వీరి వృత్తులు. మంగలి వాళ్ళు కొండమంగలి, శ్రీమంగలి, అద్దం మంగలి అని మూడు రకాలు. వీరి తండ్రి అంగారకుడు. అంగారకుని తండ్రి సుమంగలి. అంగారకుడు అయోని పుత్రుడు అగ్ని నుండి పుట్టినవాడు. ఇతనికి నాభక, శౌరకారుడు, కళ్యాణభక్తుడు, శుభమంగళ అనే పేర్లు కూడా ఉన్నాయి. అంగారకుని భార్య ధుంరావతి. ధుంరావతి భృగ్మాఋషి కూతురు. ఈమె కూడా అయోని పుత్రిక. భృగ్మాఋషి జడల నుండి పుట్టింది. వీరిరువురి  సంతానం ధనపాలకుడు, ఋషిపాలకుడు, అధిపాలకుడు. ధనపాలకుడు పెరిగి బిలాస్‌పురంలో నైనావతి శంకరుని దగ్గరకు వెళ్ళి, పూజ చేయడం వల్ల శ్రీమంగలి అయ్యాడు. అతిపాలకుడు తన తండ్రియైనా అంగారకుని దగ్గరే ఉండి విద్యాబుద్ధులు, కొన్ని శ్లోకాలు, కొన్ని పయాలు నేర్చుకొని, తండ్రి దగ్గరే ఉన్నాడు. 
కొన్నిరోజులకు అంగారకుడు అధిపాలకునితో నాకు వృద్ధాప్యం వచ్చింది. నేను స్వర్గస్థుడను పొందడానికి సిద్ధంగా ఉన్నాను. మీ పెద్దన్నయ్య ధనపాలకుడు తిరుపతి కొండలపై ఉన్నడు. మీ చిన్నన్నయ్య ఋషి పాలకుడు బిలాస్‌పురంలో ఉన్నాడు. వాళ్ళిద్దరిని తీసుకొని వస్తే మీ ముగ్గురికి సమభాగం పంచి ఇస్తానన్నాడు. అధిపాలకుడు తండ్రి ఆజ్ఞననుసరించి పెద్దన్నయ్య దగ్గరకు వెళ్తాడు. ధనపాలకుడు మాంసాహారి, మధుపానీయాలు తీసుకుంటాడు. తిరుపతి కొండలపైకి వెళ్ళి భోజనం చేయకపోతే అతని తల సహస్ర వక్కలవుతుంది. అనే శాపం ఉండడం వల్ల అధిపాలకుడు పెద్దన్నయ్య దగ్గర మధుమాంసాలతో కూడిన భోజనం చేసి తీసుకొని వస్తాడు. అక్కడి నుండి చిన్నన్నయ్య దగ్గరకు అతన్ని తీసుకొని వస్తాడు. అంగారకుడు చిమ్మటేశ్వరస్వామి భక్తుడు. మధుమాంసాలు తినడం నేరంగా భావించి, అధిపాలకుని దూరంగా వుండు నీవు. మధుమాంసం ముట్టుకున్నావు. మనది శీవమతం. చాలా నియమ నిష్టలు కలిగి ఉండాలే అని, పెద్దవారిద్దరిని పిలిచి మీ తమ్ముడు విద్యాబుద్ధులు, శ్లోకాలు, పద్యాలు నేర్చుకున్నాడు. మనకు ఒక అర్థిబిడ్డ ఆడబిడ్డ ఉండాలి. కాబట్టి ఇప్పటి నుండి అధిపాలకుడు ఒక నిలువుటద్ధం పట్టుకొని మీ ఇద్దరు అన్నయ్యలను యాచిస్తూ, నాయీ బ్రాహ్మణ కులపురాణంను పటం ద్వారా చెబుతూ జీవిస్తాడు. మిమ్ములకాదని ఇంకెవ్వరిని అడిగినా పత్తికాయ లెక్క తల పగిలి చస్తాడని చెప్పి కాశిలో పటం, కంచిలో సన్నతులు, ఒక రాగి శాసనం రాయించినాడు. మీరు ఇతనిని కాదంటే, ఇతనికి పెట్టకపోతే నరకం పాలైపోతారు. కాశిలో గోహత్య, శిశుహత్య, బ్రాహ్మణ హత్య చేసినంత పాపం తగులుతుంది. అని అందరికి సమభాగం పంచి స్వర్గస్థుడవుతాడు. అపుడు ధనపాలకుడు తిరుపతి కొండలపైకి వెళ్ళి జగన్నాథునికి సేవ చేస్తూ కొండ మంగలి అవుతాడు. ఋషిపాలకుడు బిలాస్‌పురంలో నైనావతి శంకరుని సేవచేస్తూ శ్రీమంగలి అవుతాడు. అధిపాలకుడు తండ్రి చెప్పిన రీతిగా నిలువుటద్ధం పెట్టి నాయీ బ్రాహ్మణ కులపురాణంను పటంతో కథ చెబుతూ అద్దం మంగలి అని పిలువబడుతూ ఇద్దరు అన్నయ్యలను యాచించి జీవనం సాగిస్తున్నారు.
మంగలి కులం ఎందుకు పుట్టింది? ఎలా పుట్టింది?
పార్వతి తపస్సు చేసి శంకరున్ని సాధించుకున్నది. శంకరుడు తపస్సుకు సంతోషపడి సరే మరి తొమ్మిది గడియాలాయె నువ్వు వచ్చి మరి మనం పెళ్ళి చేసుకోవాలె ఎట్లా అని పార్వతిని అడుగుతాడు. మనము మూడో ముడివేసుకోవాలంటే ఒక పరమభక్తుడు కావాలె. పెండ్లికి పనివాడు కావాలె. పనివాడు లేనిది మనం ఎట్లా జేసుకుంటం. పెండ్లికి చాప పరిచేది ఉంటది. పొరొన్లు పట్టేది ఉంటది. గరిగబుడ్లు తెచ్చేది ఉంటది. పందిరి వేసేది ఉంటది. పోలు పోసేది ఉంటది. ఇవన్ని చేయడానికి ఒక పనివాడు గావాలె. వాడు తల్లిదండ్రులకు పుట్టినవాడు వద్దు. అయోనిపుత్రుడు వరాన బుట్టాలె. అతడు పెండ్లి చేస్తే మోక్షం అని ఆలోచించసాగారు.
మంగళ గళ మహాఋషి, గౌతమ మహాఋషి, అత్గ్నిఋషి, వాయుఋషి, అంగిరా ఋషి అనే అయిదుగురు ఋషులు తపస్సు చేస్తుండగా రాక్షసులు వచ్చి నలుగురు ఋషులను చంపేవరకి పెద్దవాడు సుమంగలి ఇక్కడ చనిపోతానని గంధమదన పర్వతం మీది పారిపోయి, అక్కడ మహంగాలి అనే వృక్షంను చూసుకొని త్రిమూర్తుల గురుంచి తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చి త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు, దేవతలు, సూర్యచంద్రులు అందరూ ప్రత్యక్షమవుతారు. శంకరుడు సుమంగలి నీ తపస్సుకు మెచ్చినా ఏం కావాలని అడిగితే నాకు కుమారుడు కావాలని కోరుకుంటాడు. అయితే భార్యను జేసుకో సంతానం కలుగుతుంది. అంటే భార్యను చేసుకోను. భార్య లేకుండా కావాలంటే త్రిమూర్తులు ఆ గంధమదన పర్వతం మీద నాలుగు వైపుల నాలుగు మూలలకు విభూతి గుండం వూసి, బ్రహ్మ ఆ గుండానికి ద్వాదశి మంత్రంను, విష్ణుమూర్తి అష్టాక్షరీ మంత్రంను, ఈశ్వరుడు పంచక్షరీ మంత్రంనుపదేశించి యజ్ఞం చేసేవరకు మంటలు పైకి లేత్తాయి. ఆ మంటల నుండి పరమభక్తుడు జన్మిస్తాడు. ఆ పిల్లవాన్ని బ్రహ్మ జూసి నాభక అని, విష్ణుమూర్తి జూసి శౌరకారుడు అని, ఈశ్వరుడు అంగారకుడు అని, పార్వతి కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం పుట్టనున్నది, కలియుగంలో మాత్రం కళ్యాణ మంటపానికి కార్తేయం నీదే కుమ్మర అని నువ్వు కళ్యాణ భక్తునివి అవుదువు గాక అని కళ్యాణ భక్తుడు అని పేరు పెట్టింది. సుమంగలి నాయనా నా వంశం సంతానం లేక నిడు వంశం అవుతుందని, వంశం అభివృద్ధి కావాలని నిన్ను తపస్సు ద్వారా సాధించుకున్నాను. కాబట్టి నీ పేరు శుభమంగళ అని పెడుతున్న అని పేరు పెట్టినాడు.    

No comments:

Post a Comment