Saturday 22 December 2012

Nayee Brahmin Community


భారదేశంలో మొట్టమొదట వైద్య సైన్సును ప్రారంభించింది మంగలివారు. వైద్య శాస్త్రానికి మొదట మెట్టు శరీరంపై పెరుగుతున్న వెంట్రుకల్ని కత్తిరించాలని కనుక్కోవడం. ముఖ్యంగా మానవుల తలపై, పురుషుల ముఖంపై విపరీతంగా పెరిగే వెంట్రుకలు రెండు విధాల మానవ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ఒకటి తలపై పెరిగే వెంట్రుకలు మెదడుకు సరఫరా కావలసిన ఆహారాన్ని వెంట్రుకలు తినేస్తాయి. రెండవది విపరీతంగా పెరిగే వెంట్రుకల్ని దుమ్ము, ధూళిబాగా పట్టేసి అందులో ఆనారోగ్యానికి కారణమైన క్రిములకు నిలయమౌతాయి. 
మనలో చాలామందిమి పేండ్లు, చీరపేండ్లు వెంట్రుకల్లో పడినప్పుడు నెత్తి, ఒళ్లు చిరాకుకు గురి కావడమే కాకుండా వాటివల్ల (తీవ్ర) అనారోగ్యానికి గురయ్యే విషయం ఎరుగుదుము. శరీరంపై పట్టే చీరపేను కూడా వెంట్రుకలు అధికంగా ఉన్న భాగంలోనే పడతాయి. మానవ అనారోగ్యానికి మూలమయ్యే ఈ వెంట్రుకల పెరుగుదల నుండి రక్షించడానికి రూపొందిదే క్షవరం సైన్సు. ఇది ప్రపంచంలోనే పుట్టిన మొట్టమొదటి వైద్య సైన్సు. ఈ సైన్సును కనిపెట్టింది అభివృద్ది చేసింది భారతదేశంలో మంగలివారని చెప్పక తప్పదు. ప్రపంచంలో క్షవరం సైన్సు అంటే ఏమిటో తెలియని రోజుల్లో భారతదేశంలో క్షవరం సైన్సు ఉనికిలోకి వచ్చింది. ఈ సైన్సును అభివృద్ధి కాకుండా అడ్డుకోవాలని మొట్టమొదటి ప్రయత్నం చేసిన మూర్ఖమానవులు బ్రాహ్మణ సన్యాసులు. సన్యాసులకు, సంసారులకు మధ్య సంబంధం విడిపోయింది. క్షవరం సైన్సుపట్ల బ్రాహ్మణ సన్యాసులకున్న వ్యతిరేక భావం వల్లే. అందుకే ఈనాటికీ బాగాక్షవరం పెరిగిన వ్యక్తిని "సన్యాసిగాడు" అని తిట్టేపదం ఉంది. బ్రాహ్మణ సన్యాసిని దళిత బహుజన కులాలవాళ్ళు ఎప్పుడూ గౌరవించలేదు. వాళ్ళు "సంసారిని" అంటే కుటుంబీకున్ని ఎక్కువగా గౌరవించారు. 
బ్రాహ్మణ సన్యాసులకు, మంగలి సైంటిస్టులకు మొట్టమొదట జరిగిన తీవ్ర సంఘర్షణలోనే సన్యాసులు క్షవరం చేసుకోనిరాకరించారు. మంగలి సైంటిస్టులు క్షవరపు సైన్సును అభివృద్ధి చెయ్యనారంభించారు. ప్రాచీన కాలంలో ఈ సంఘర్షణ జరుగుతున్నపుడు ప్రపంచ దేశాల్లో దేంట్లో కూడా క్షవరం చేశుకునే సంస్కృతి ఉన్నట్లు ఆధారాలు లేవు. మొదట్లో భారతదేశం మంగలి సైంటిస్టులు సన్యాసుల వెంట్రుకల పెంపకం, స్నాన రహిత జీవితానికి భిన్నంగా, ఫుర్తిగా గుండుగీకే పద్ధతిని కనిపెట్టారు. ఈ విధంగా గుండు గీసుకునే సంస్కృతిని దేశం మొత్తం మీద ప్రచారం చేశారు.
ఈ విధంగా నున్న గుండు గీకడం, పురుషుని మొఖంమీది గడ్డం గీకడం వంటి ప్రక్రియను చాలా శాస్త్రీయ పద్ధతిలో మంగళ్ళు కనిపెట్టారు. పోతే అది కనిపెట్టగానే సరిఫొదు, ఆ పని చెయ్యగల ఇనుపకత్తిని తయారుచెయ్యడం కూడా మన భారతదేశంలోనే ముందు తయారైంది. భారతదేశంలో మంగలికత్తి అతివాడిగా ఉండి నెత్తి, గడ్డం గీకడానికి అనువుగా తయారైన నాటికి ఏ దేశంలో అటువంటి కత్తి ఉనికి కనబడదు. ఇటువంటి ఇనుప కత్తితో క్షవరం చేసుకోవడాన్ని హిందూ బ్రాహ్మణులు వ్యతిరేకిస్తున్న దశలోనే మనదేశంలో జైన తిరుగుబాటు వచ్చింది. ఆ తిరుగుబాటులో జైనులు ఆడ, మగ తేడా లేకుండా అందరూ గుండు గీక్కునే సంస్కృతిని ప్రచారం చేశారు. అదే సంస్కృతిని బుద్ధుడు వచ్చాక బౌద్ధ సంఘాలు నియమంగా పెట్టాయి.                
బౌద్ధ సంఘాలకు మొట్టమొదటి నాయకుడుగా ఎదిగిన వారిలో ఉపాలి గొప్ప మంగలి. అతనే బుద్ధునికి క్షవరం చేసే సైన్సును నేర్పాడు. బుద్ధుడు స్వయంగా గుండ్లు గీకేవాడు. అది కూడా ఆడ, మగ తేడాలేకుండా గుండు గీక్కోవడానికి నిరాకరించి గడ్డాలు, తల పెంచుక తిరిగే బ్రాహ్మణులు ఎంతోమంది తీవ్రమైన రోగాలతో చనిపోయారు. ఈ స్థితి నుండి బయటపడేందుకు శంకరాచారి క్రీ.శ. 7వ శతాబ్ధంలో బ్రాహ్మణులు కూడ గుండు గీక్కోవాలని ప్రచారం చేశాడు. ఆ తరువాత బ్రాహ్మణ ఆరోగ్యం కొంత మెరుగైంది. ఇప్పుడు మనం చూసే బ్రాహ్మణ పూజారి గుండు శంకరాచారి కాలం నుండీ వచ్చిందే.
మంగళ్ళు నిర్వహించిన రెండవ వైద్య సైన్సు మంగళి కత్తితో గడ్డలు, పుండ్లు వాతిని చెట్ల మందులు పోసి మత్తు తెప్పించి ఆపరేషన్‌లు చెయ్యడం. భారతదేశంలో బ్రాహ్మలు బ్రిటిష్ వాళ్ళు వచ్చేంతవరకు డాక్టర్ వృత్తి పూర్తిగా వ్యతిరేకించారు. కాని వైద్య శాస్త్రాన్ని అభివృద్ధి చేసింది మంగళ్లే. మంగళి స్త్రీలు దాయమ్మలుగా ఉండి కానుపులు చేసే సైన్సును తయారుచేశారు. అంతేకాక గ్రామ గ్రామాన చెట్ల మందులతో రోగాలు నయం చేసే వైద్యం మంగలి డాక్టర్ల చేతుల్లోనే ఉండేది. బ్రాహ్మణ సన్యాసులు ఈ వైద్యాన్ని కూడా వ్యతిరేకించారు. కాని మంగలి సంటిస్టులు బ్రాహ్మణ మూర్ఖత్వాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ వైద్య శాస్త్రాన్ని అభివృద్ధి చెయ్యడానికి పూనుకోబట్టే భారతదేశంలో ఈ మాత్రం వైద్య సైన్సు బతికున్నది. 
మంగలినీతి:
మంగలినీతి లేకుండా ఎన్నో బ్రాహ్మణ, అగ్రకులస్తుల తలలు తెగిపోయేవి. బ్రాహ్మణ పూజారులు గుండుగీక్కోవడం మొదలు పెట్టాక, కోమట్లు, రెడ్లు, వెలమలు, కమ్మలు, భూస్వాములుగా ఎదిగాక క్షవరపు సైంటిస్ట్ అయిన మంగళ్ళని ఎంతో అవమానించేవారు. కాని అవమానించిన వారి పట్లకూడ మంగళ్ళు నీతితో క్షవరం చేశారు. తిట్టినవాని, కొట్టినవాని తలను తప్పియ్యాలంటే మంగళ్ళకు పెద్ద సమస్య కాదు. తమ చేతికి రాని జుట్టు ఉండదు. తమ చేతికి దొరకని మెడ ఉండదు. చేతిలో బ్లేడును మించిన కత్తి వేలఏండ్లుగా ఉండనే ఉన్నది. గడ్డం చేసేటప్పుడు తిట్టినోని గొంతు కోయవచ్చు. తలగీకినప్పుడు కొయ్యవచ్చు.  కటింగ్ చేసే అప్పుడు కత్తెర గొంతులో దించవచ్చు. కాని మంగలి నీతికి కట్టుబడి ఉన్నారు. కనుక వాళ్ళు శత్రువును కూడ చంపలేదు. ఇ మంగలినీతే సమాజాన్ని కాపాడింది. 
బ్రాహ్మణుని అవినీతి మంగళికి ఉంటే భారత దేశం ఎప్పుడో అంతమొందేది. కనుక బ్రాహ్మణులు అగ్రకులాల వారు మంగళ్ళ నుండి నేర్చుకోవలసిన మహా పాఠాలు ఎన్నో ఉన్నయి. 
"మంగలినీతి, చాకలి శుభ్రత లేకుండా, భారతదేశం బతికుండేది కాదు".  

No comments:

Post a Comment